Manchu Taakina Song Lyrics – Ela Cheppanu Movie

Manchu Taakina Song Lyrics in Telugu

మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా
మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా
చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా
కల జారిన ఈ కనుపాపలకి నలువైపులా నలుపేనా
ఏమో .మంచు తాకినా ఈ వనం…

తుంచిన పూలను తెచ్చి అతికించలేను గాని
చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకోనీ
చిగురాశలు రాలిన కొమ్మా చినబోకమ్మా
పచ్చదనం నీలో ఇంకా మిగిలుందమ్మా
అందామని ఉన్నా అవకాశం ఉందా
నిందించలేని మౌనమే నన్నాపగా…

నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ
రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ
తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా
తడి ఆరని చెంపలు తుడిచే చెలిమవగలనా
నిదురించని నిజమై నిలదీసే గతమే
భరించలేని భారమై వెంటాడగా…

Click here for the details of :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Idhe Kadha Nee Katha Song Lyrics – Maharshi MovieIdhe Kadha Nee Katha Song Lyrics – Maharshi Movie

Idhe Kadha Nee Katha  Lyrics ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి

Drunk and Drive Song Lyrics – Chalo MovieDrunk and Drive Song Lyrics – Chalo Movie

Drunk and Drive Song Lyrics హొయ్… హొయ్… చూస్తుంటె పువ్వుల షేపు…కాని పోలందేవి టైపూ.. హొయ్..అబ్బచ సెంటిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే… హొయ్..అబ్బచ ఓ…. చందమామ లాగ బైటకి బిల్డప్ ఇస్తావే… చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే..ఏ.. వర్జినల్ని