Nannu Dochukunduvate Song lyrics – Gulebakavali Movie

Music : Joseph Krishna

Singer (S) : Ghantasala, P.Suseela

Lyricist : C.Narayana Reddy

Nannu Dochukunduvate Song Lyrics

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

్నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

Also, read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ee vela Naalo Enduko Aasalu Song Video Lyrics – Mooga Nomu MovieEe vela Naalo Enduko Aasalu Song Video Lyrics – Mooga Nomu Movie

Ee vela Naalo Enduko Aasalu Song Lyrics In Telugu ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నాకోసమే