Nelavanka Thongi Chusinde Song Lyrics – Rajakota Rahasyam Movie

Nelavanka Thongi Chusinde Song Lyrics

నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ .. తనువెల్ల పొంగి పూచింది !

నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక .. నిలువెల్ల వెల్లి విరిసింది !

నెలవంక తొంగి చూసింది…

ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో .. నీ రూపమందు నిలిచె
సుడిగాలులైన ..జడివానలైన.. విడిపోని బంధమే వెలసె !

నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది

ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత .. ఈనాటి కౌగిలింత
ఏనాటికైన .. ఏ చోటనైన విడిపోనిదోయి మన జంట !!

నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక .. నిలువెల్ల వెల్లి విరిసింది !
నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది

Also, read about the following Movie Download Websites:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post