ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె..
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ!!
నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి..చలి..చలి..చలి..
హా..చలి..చలి!!
పారేసుకోవాలనారేసుకున్నావు, అరె..అరె..అరె..అరె..
నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ!!
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి..హరి..హరి..
హరి..హరి!!
ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె.
నా లోని అందాలు నీ కన్నులా..ఆరేసుకోనీ సందేవెళ..
ఓ..నా పాట ఈ పూట నీ పైటలా,దాచేసుకోనీ తొలి పొంగులా..
నా లోని అందాలు నీ కన్నులా..ఆరేసుకోనీ సందేవెళ..
హే..నా పాట ఈ పూట నీ పైటలా,దాచేసుకోనీ తొలి పొంగులా..
నీ చూపు సోకాలి..
నా ఊపిరాడాలి..
ఆ నీ చూపు సోకాలి..
నా ఊపిరాడాలి..
నీ జంట నా తీపి చలిమంటకావాలి!!
నీ వింక కవ్వించకే,కాగిపోవాలీ..
నీ కౌగిలింతలోనే..దాగి పోవాలి!!
ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..హా..అరె..హా..అరె..హా..అరె..హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ!!
నాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి..హరి..హరి..
హె..హరి!!
నీ ఒంపులో సొంపులో హరివిల్ల్.. నీ చూపులో రావులే విరజల్లు..
ఆ.. నీ రాక నా వలపు ఏరువాక..నీ కాక నీలిమబ్బు నా కోక!!
నే వేగి పోవాలి..
నేనూగిపోవాలి..
నే వేగి పోవాలి..
నేనూగిపోవాలి..
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి!!
ఈ జోడు పులకింతలే నా పాట కావాలీ..
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి!!
ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..హా..అరె..హా..అరె..హా..అరె..హా
కోకెత్తుకెళ్ళింది కొండగాలీ!!
నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి..చలి..చలి..చలి..
హా..చలి..చలి!!
నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి..చలి..చలి..చలి..
హా..చలి..చలి!!
అ ఆ..లాలాల లాలాల లాలాల
లల ల..లల ల..లల ల..లల ల!!