Chakori Song Lyrics in Telugu
పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి..
పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి..
పరువంలో రాదారి ఆకాశం అయిందే..
పైపైకెల్లాల్లన్నదే..చక్కోరి..
పదరా ఆ చోటుకీ ఈ చోటికంటానా..
నీతో ఏ చోటికైనా వెంట నే రానా..
చక్కోరి..పందెములో..పందెములో..
నే ముందరో నువు ముందరో చూద్దాం..చూద్దాం..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..
తొలిగా మౌనాలని మోగించగలదెవరో..
ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..
కాలం ఎప్పుడో ఆ క్షణం ఇంకెప్పుడో..
ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..
వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..
ఇట్టే పసిగట్టి కను కదలిక బట్టి కనిపెట్టి..
వలపుల రుచి బట్టే పని ముట్టే అవసరమట ఇకపైన..
ఇన్నాళ్లుగ దాగున్నది విరహం..
ఎన్నాళ్లని మొయ్యాలట హృదయం..
అందాకీ పయనం సులువుగ మరి ముగిసేన..
చక్కోరి..పందెములో..పందెములో..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..
నిన్ను కోరి..నిన్ను కోరి..నిన్ను కోరి ఉన్నానురా..
నిన్ను కోరి ఉన్నానురా..నిన్ను కోరి..కోరి..
తోడై నువు తీయించిన పరుగులు..
నీడై నువు అందించిన వెలుగులు..
త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..
బాగున్నది నీతో ఈ అనుభవం..
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..
నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా ..
తోడై నువు తీయించిన పరుగులు..
నీడై నువు అందించిన వెలుగులు..
త్రోవై నువు చూపించే మలుపులు మరిచేనా..
బాగున్నది నీతో ఈ అనుభవం..
ఇంకా ఇది వందేళ్ళూ అవసరం..
నేనెందుకు ఏంచేయాలన్నది మరి తెలిసేనా….
చక్కోరి..పందెములో..పందెములో..
మొదట ఆ మాటని మాట్టాడగలదెవరో..
మొదట ఈ ప్రేమని బయటుంచగలదెవరో..
తొలిగా మౌనాలని మోగించగలదెవరో..
ముందు చెప్పేదెవరో ముందుండేదెవరో..
ఎదురుగ నిలిచి ఎదలను తెరిచే..
కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..
కాలం ఎప్పుడో..ఆ క్షణం ఇంకెప్పుడో..
క్షణం ఇంకెప్పుడో..క్షణం ఇంకెప్పుడో ..