Na Madi Ninnu pilichinde Ganame Song Lyrics – Aaradhana Movie

Na Madi Ninnu Pilichinde Ganame Song Lyrics

ఓ ప్రియతమా ప్రియతమా..
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నేనెరుకలేను
ఏ పేరున నిన్ను నే పిలవగల నూ
ఎవ్వరివో నీవు నేనెరుకలేను
ఏ పేరున నిన్ను నే పిలవగల నూ
తలపులలోనే నిలిచేవు నీవే
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగ బాధా ఎందాకా దాచేను
వేచిన మదినే వెలిగింప రావే
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

Also, Read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Drunk and Drive Song Lyrics – Chalo MovieDrunk and Drive Song Lyrics – Chalo Movie

Drunk and Drive Song Lyrics హొయ్… హొయ్… చూస్తుంటె పువ్వుల షేపు…కాని పోలందేవి టైపూ.. హొయ్..అబ్బచ సెంటిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే… హొయ్..అబ్బచ ఓ…. చందమామ లాగ బైటకి బిల్డప్ ఇస్తావే… చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే..ఏ.. వర్జినల్ని