https://youtu.be/Bq0Yc_2JtXs
Ramasakkani Talli Song Lyrics In Telugu
రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా
ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
అడవిలో మానయ్యి పోతనయ్యో పోతనయ్యా
తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
బతుకు శాపమైన బంగారు తల్లివి
నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా
పటువారి దొరగారు అరిటాకులో నాకు
పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే
దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
జాలితోటి నాకు జామపండు ఇచ్చి
తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా
ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే
దండి గుణము చూసి దండాలు పెట్టిన
కాటు వేసేదాకా తెలవదయ్య నాకు
కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా
కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య
వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి
పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి
ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా
పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
Also, read about the following Movie Download Websites: