Nenu Puttanu Song Lyrics In Telugu
నేను పుట్టాను లోకం మెచ్చిందీ
నేను ఏడ్చాను లోకం నవ్విందీ
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ
నాకింకా లోకంతో పని ఏముందీ.. డోంట్ కేర్..
నేను పుట్టాను లోకం మెచ్చిందీ
నేను ఏడ్చాను లోకం నవ్విందీ
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ
నాకింకా లోకంతో పని ఏముందీ.. డోంట్ కేర్…..
నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతోకలిసాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
తెల్లవారితే వెనకన జేరి నవ్వుకుంటాయి…..
అహ్హహా..హాహహ..హహా.. డోంట్ కేర్……
నేను పుట్టాను లోకం మెచ్చిందీ
నేను ఏడ్చాను లోకం నవ్విందీ
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ
నాకింకా లోకంతో పని ఏముందీ..
మనసును దాచేటందుకే పైపై నవ్వులు వున్నాయి
మనిషికి లేని అందం కోసమే రంగులు వున్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళనెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వాళ్ళనెత్తికే చేతులువస్తాయి
ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులువున్నాయి
. డోంట్ కేర్……
నేను పుట్టాను లోకం మెచ్చిందీ
నేను ఏడ్చాను లోకం నవ్విందీ
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ
నాకింకా లోకంతో పని ఏముందీ..
మనిషిని మనిషిని కలిపేటందుకే
పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకు మధువులువున్నాయి
బాధలన్నీ బాటిల్ లో నేడే దిoపేసెయ్
బాధలన్నీ బాటిల్ లో నేడే దిoపేసెయ్
అగ్గిపుల్ల గీసేసేయ్.నీలోసైతాన్ తరిమేసేయ్
అహ్హహా..హాహహ..
నేను పుట్టాను లోకం మెచ్చిందీ
నేను ఏడ్చాను లోకం నవ్విందీ
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ
నాకింకా లోకంతో పని ఏముందీ..
. డోంట్ కేర్……
Also, Read About: