https://youtu.be/9Kag-5aNjVs
Oka Laila Kosam Song Lyrics In Telugu
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా… లైలా… లైలా
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ ప్రతి రాత్రీ
ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ… మజ్ఞూ… మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ఆకాశానికి నిచ్చెన వేసీ…
చుక్కల పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ…
స్వర్గానికి నే దారులు వెతికీ..
ఇంద్రుని పట్టుకొనడిగానూ
లైలా ఏదనీ.. నా లైలా ఏదనీ
దిక్కుల నడుమా నేనుంటే..
చుక్కల పట్టుకొనడిగావూ
కన్నుల ముందూ నేనుంటే..
కన్నులు మూసుకు వెదికావూ
ప్రతి చూపూ ప్రతి పిలుపూ…
ప్రతి చోటా నీ కోసం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ అతని కోసం
లైలా…లైలా…లైలా
ఒక లైలా కోసం.. తిరిగాను దేశం
పగలూ రేయీ పందెం వేసీ..
సృష్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజ్ఞూ ఏడనీ.. నా మజ్ఞూ ఏడనీ
రంభా ఊర్వశి ధైర్యం చేసీ..
స్వర్గం విడిచీ వచ్చారూ
లైలా నేననీ.. హహహ.. ఆ లైలా నేననీ
ఇల్లూ వాకిలి వదిలొస్తే
రంభా ఊర్వశి అంటావూ
నీ కోసం నే పుట్టొస్తే..
ఎవ్వరి వెంటో పడతావూ
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ..
ప్రతి తలపూ నీ కోసం
ఒక మజ్ఞూ కోసం వెతికాను లోకం
ప్రతి పగలూ.. ప్రతి రాత్రీ
.. ప్రతి తలపూ అతని కోసం
మజ్ఞూ…మజ్ఞూ…మజ్ఞూ
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ.. ప్రతి రాత్రీ..
ప్రతి పాటా.. ఆమె కోసం
లైలా…లైలా…లైలా