Kadavettu kochindi kanepilla Song Video Lyrics – Prema Nagar Movie

Kadavettu  Kochindi Kanepilla Song Lyrics In Telugu

కడవెత్తుకొచ్చిందీ… ఈ ఈ ఈ… కన్నెపిల్ల.. ఆ ఆ..
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కాడెత్తుకొచ్చాడూ…ఊ ఊ ఊ… గడుసుపిల్లడు.. ఊ ఊ..
వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే…చూడాలి..
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల

చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన..కండరాలు..
బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు
వసుంటే.. చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు

దున్నుతుంటే …చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది

చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు

Also, Click here to Know Where to Watch:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Cheliya Ledu Song – Devdas(old) MovieCheliya Ledu Song – Devdas(old) Movie

https://youtu.be/nnj80HodOZU Cheliya ledu Song Lyrics in Telugu చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ వున్నదంతా చీకటైతే వుంది నీవేలే వున్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే చెలిమి

Jagame Maya Song Video Lyrics -Devadas(old) MovieJagame Maya Song Video Lyrics -Devadas(old) Movie

Jagame Maya Song Lyrics In Telugu జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా కలిమి లేములు