Neevuleka Veena Song Video Lyrics – Doctor Chakravarty Movie

Song Details:-

  • Song: Neevuleka Veena
  • Singer: P Susheela
  • Lyrics: Aathreya
  • Music: Saluri Rajeshwara Rao

Neevuleka Veena Song  Lyrics In Telugu

నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది
నీవు లేక వీణ.
జాజిపూలు నీకై రోజు రోజూ పూచే చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచి చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలు బోయే. నీవు లేక వీణ.
కలలనైన నిన్ను కనుల చూతమన్న నిదుర రాని నాకు కలలు బూనరావే
కదలలేని కాలం విరహగీతి రీతి కదలలేని కాలం విరహగీతి రీతి
పరువము వృథగా బరువుగ సాగే. నీవు లేక వీణ.
తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను తలపులెన్నో మదిలో దాచి వేచినాను
తాపమింక నేను ఓపలేను స్వామి తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరుణను యేలగ రావా
నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది
నీవు లేక వీణ.

Click here to know where to watch:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Manchu Taakina Song Lyrics – Ela Cheppanu MovieManchu Taakina Song Lyrics – Ela Cheppanu Movie

Manchu Taakina Song Lyrics in Telugu మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా కల జారిన ఈ కనుపాపలకి నలువైపులా నలుపేనా ఏమో .మంచు