Chita pata Chinululu Song Video Lyrics – Aatma Balam Movie

Song Details:-

  • Music Director: K.V. Mahadevan
  • Lyrics Writer: Acharya Atreya
  • Singers: Ghantasala , P.Suseela

Chitapata Chinukulu Song Lyrics In Telugu

చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడె సరసన ఉంటే.
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే…
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే. మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే.
మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటే.
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

కారు మబ్బులు కమ్ముతు ఉంటే …
కమ్ముతు ఉంటే.
ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే…
కనపడకుంటే
ఆ.కారు మబ్బులు కమ్ముతు ఉంటే …
కమ్ముతు ఉంటే.
ఓ.ఓ.కళ్ళకు ఎవరూ కనపడకుంటే…
కనపడకుంటే
ఆ జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ…
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ…
చలి చలిగా గిలివెస్తుంటే.
ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే.
ఓహోహో…
చలి చలిగా గిలివెస్తుంటే.
ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే.
ఓహోహో…
చెలి గుండెయిలో రగిలే వగలే
చెలి గుండెయిలో రగిలే వగలే చలిమంటలుగా అనుకుంటే…
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ…
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ…
చిటపట చినుకులు పడుతూ ఉంటే.
చెలికాడె సరసన ఉంటే.
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే…
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

Also, Read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post