Mooga Manasulu Song Lyrics – Mahanati Movie

Mooga Manasulu Song Lyrics

మూగ మనసులు

మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటె మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా

కుహూ కుహూ కుహూ

స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ

మూగ మనసులు మూగ మనసులు

ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమా పూల పరాగమా

నా గత జన్మల ఋణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరే వేగం పెంచే మైకం
మననిల తరమని
తారాతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకేం ఎవరినీ
మూగ మనసులు మూగ మనసులు

Also, Read :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Kannu Kannu Kalisai Song Lyrics – Paisa Vsool MovieKannu Kannu Kalisai Song Lyrics – Paisa Vsool Movie

https://youtu.be/18FUE2TULmE Kannu Kannu Kalisai Song Lyrics కన్ను కన్నూ కలిశాయి… ఎన్నో ఎన్నో తెలిశాయి… ఓ… కన్ను కన్నూ కలిశాయి… ఎన్నో ఎన్నో తెలిశాయి… నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం… ఇప్పుడయ్యాం కదా ఒక్కరం… మనసు మనసు కలిశాయి… మబ్బుల్లో

Le Le Na Raja Song Lyrics- Premanager MovieLe Le Na Raja Song Lyrics- Premanager Movie

https://youtu.be/b2zzHc_6NYU Le Le Na Raja Song Lyrics In Telugu లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను