Asha Pasham Song Lyrics – Care Of Kancharapalem Movie

Asha Pasham Song Lyrics

ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..

 

చేరువైన సేదు దూరాలే

తోడవ్తూనే వీడే వైనాలే

నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో..

ఆటు పోటు గుండె మాటుల్లోన..

సాగేనా…

 

ఏ లే లే లేలో..

కల్లోలం ఈ లోకంలో

లో లో లోలోతుల్లో

ఏ లేలో ఎద కొలనులో..

 

నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటై పోతుంటే

నీ గమ్యం గంధరగోళం..

దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు

పల్లటిల్లిపోయి నీవుంటే..

తీరేనా నీ ఆరాటం..

 

ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెల

రేపేటవునో తేలాలంటే

నీ ఉనికి ఉండాలిగా

 

.... ఆటు పోటు

గుండె మాటుల్లోన

సాగేనా…..

 

ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో

 

ఏ జాడలో ఏమున్నదో

క్రీనీడల విధి వేచున్నదో..

ఏ మలుపులో ఎం దాగున్నదో

నీవు గ తేల్చుకో..నీ శైలిలో..

 

చిక్కు ముళ్ళు గప్పి

రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే

తెలియకనే సాగే కథనం..

నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే

కంచికి నీ కథలే దూరం…

 

నీ చేతుల్లో ఉంది సీతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా

రేపేటవునో తేలాలంటే

నువ్వెదురు సూడాలిగా…

 

... ఆటు పోటు

గుండె మాటుల్లోనఉంటున్న….

Also, Click here for the details of Telugu Movies :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Chitram Bhalare Vichitram Song Lyrics – Daana Veera Soora Karna MovieChitram Bhalare Vichitram Song Lyrics – Daana Veera Soora Karna Movie

Chitram Bhalare Vichitram Song Lyrics చిత్రo ఆయ్ భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం పిలువగనే ప్రియవిభుడే విచ్చేయుటయే చిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రo ఆయ్ భళారే విచిత్రం రాచరికపు జిత్తులతో