Nee Kallathoti Song Lyrics – Thulasi Movie

Nee Kallathoti Song Lyrics in Telugu

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం…
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం

అడుగునౌతాను నీవెంట నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వు నౌతాను పెదవంచున
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళ లోన తోలి సిగ్గు నేనవ్వనా….

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం

వెన్నేలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీదరికి చేరకుండా
వూపిరౌతాను నీలోన నేను ఎన్నడు నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడు కుంటూ నేనుండి పోతాను పారాణి లా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలి లా..

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం…

Click here for the details of:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Asha Pasham Song Lyrics – Care Of Kancharapalem MovieAsha Pasham Song Lyrics – Care Of Kancharapalem Movie

Asha Pasham Song Lyrics ఆశా పాశం బంది చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..   చేరువైన సేదు దూరాలే తోడవ్తూనే వీడే వైనాలే నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో.. ఆటు