Hey Nenila Song Lyrics – Mr.Majnu Movie

Hey Nenila Song Lyrics in Telugu

హేయ్ నేనిలా, నీతో నేడిలా
హేయ్ చూడిలా, ఎంతో వింతలా
ఇన్ని రోజుల్లో ఏరోజు
లేనంత లేడీ పిల్లలా
పూల బంతల్లే నా గుండె
అందంగా గంతులేసేలా
చేతి గీతల్లో
గీసుంది బహుశా
నిన్ను కలిసేటి కొత్త వరస
గోరు వెచ్ఛంగా నీ చూపు
నా గుండె లోన గుచ్చగా
అన్ని మైమరచి పోతున్నా
నీ మాయలోన మత్తుగా
హేయ్ నేనిలా, నీతో నేడిలా
హేయ్ చూడిలా, ఎంతో వింతలా
నువ్వు ఎంతో ఇష్టమన్న
పాటలే నేనిలా పాడుతున్నా
నీకు ఎంతో ఇష్టమైన
ఆటలా నేనిలా మారుతున్నా
చుట్టు పక్క ఎంతమంది
నన్ను పట్టి ఆపినా
పట్టు బట్టి పరుగుపెట్టి
నిన్ను చేరనా
నాకు నేనే దారమేసి
ఎంత కట్టి చూసినా
నిమిషమైన నీకు
దూరమవ్వలేననా
నువ్వు పట్టించుకోనట్టు ఉన్నా
నువ్వు నన్నెంత తిప్పించుకున్నా
గోరు వెచ్ఛంగా నీ చూపు
నా గుండె లోన గుచ్చగా
అన్ని మైమరచి పోతున్నా
నీ మాయలోన మత్తుగా
రోజులోని వేళలన్నీ
గమ్మని ఒక్కసారి పిలవలేముగా
మనసులోని మాటలన్నీ
వినమని మూతగట్టి ఇవ్వలేముగా
కరిగిపోవు నిమిషమల్లే
చెరిగిపోవు నవ్వులే
గుండెలోని ఊహలన్నీ నీకు చెప్పనా
చేతిలోని నీరులాగా
జారిపోక ముందరే
వయసులోని ఆశలన్ని విన్నవించనా
ఎన్ని సమయాలు నీ పక్కనున్నా
ఒక్క క్షణమేగా నాకివ్వమన్నా
గోరు వెచ్ఛంగా నీ చూపు
నా గుండె లోన గుచ్చగా
అన్ని మైమరచి పోతున్నా
నీ మాయలోన మత్తుగా
హేయ్ నేనిలా, నీతో నేడిలా
హేయ్ చూడిలా, ఎంతో వింతలా

Click here for the details of:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post